- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏలూరులో అత్యధిక వర్షపాతం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణకోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో భారీగా వాన పడింది. ఈ మేరకు 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది..

దిశ వెబ్ డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం(West-central Bay of Bengal), దక్షిణకోస్తా తీర ప్రాంతం(South Coastal region)పై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో భారీగా వాన పడింది. ఈ మేరకు 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన 20 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాసాలకు వెళ్లాలని తెలిపింది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశించింది.






