కుల రాజకీయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 11:22:03  IST  )

కులం అన్నం పెట్టదని.. మతం నీళ్లు ఇవ్వదని చంద్రబాబు సూచించారు. కొందరు కులం పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హోంమంత్రి మేకప్‌పై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ...

కుల రాజకీయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్(Sai Krishna Lockup Death) పరిణామాలతో కుల రాజకీయాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. గాదె సాయికృష్ణ కాపు కులానికి చెందిన వ్యక్తి అని.. అతని మిస్సింగ్ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు కొందరు సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యత తగ్గుతుందని, అదంతా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వల్లేననే ఆరోపణలు, విమర్శలు చేశారు. కూటమిలో నుంచి పవన్ కల్యాణ్ బయటకు రావాలని, ఒంటరిగా ఎదగాలని సూచనలు చేశారు.

సీఎం కీలక వ్యాఖ్యలు

అయితే ఈ విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పందించారు. మార్కాపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కుల రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కులం అన్నం పెట్టదని.. మతం నీళ్లు ఇవ్వదని చంద్రబాబు సూచించారు. కొందరు కులం పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హోంమంత్రి మేకప్‌పై మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. సాయికృష్ణ తరహా ఘటనలను ప్రోత్సహించననని చెప్పారు. వెంకటేశ్వరస్వామిని కూడా అప్రతిష్టపాలు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘవిద్రోహులను, రౌడీలను తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో చేసిన అరాచకాలను సరిచేయడానికి కూటమి 15 ఏళ్లు పడుతోందన్నారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Next Story