- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ల కోసం మహాసభ : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ మహిళా మహాసభ నిర్వహించాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ మహిళా మహాసభ నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని కవిత అన్నారు. బిల్లును పోస్ట్ డేటెడ్ చెక్‌లా మార్చారని, అమలులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని విమర్శించారు. బిల్లు అమలుకు దేశవ్యాప్తంగా మహిళల శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోనైనా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలోనైనా లక్షలాది మహిళలతో భారీ ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో నిజమైన సాధికారత రావాలంటే పవర్‌ఫుల్ స్థానాల్లో ఉండే అవకాశాలు కల్పించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
మహిళలు ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత వారిని అడ్డుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని, అందుకే చట్టబద్ధమైన రిజర్వేషన్లు అత్యవసరమని స్పష్టం చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు తప్పకుండా సాధిస్తామని, అదే సమయంలో మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. 2022–23లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, అంతేకాకుండా 18 రాజకీయ పార్టీలను ఈ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడేలా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచామని కవిత గుర్తుచేశారు. ఆ ఒత్తిడితోనే బిల్లుకు ఆమోదం లభించిందని, అయితే అమలు మాత్రం ఇంకా జరగలేదని అన్నారు. మహిళల ఓట్లు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమని, మహిళల్లో చైతన్యం పెరిగిన నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నారని కవిత పేర్కొన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయని పార్టీలకు ఓట్లు వేయబోమనే ఉద్యమాన్ని మహిళలు ప్రారంభించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల కోసం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టానని.. మహిళలందరూ గర్వపడేలా, కాలర్ ఎగరేసుకునేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నానని కవిత అన్నారు.






