- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాన్నతో సరదాగా స్టార్ట్ చేసి రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానానికి!
తండ్రితో సరదాగా గ్రౌండ్‌కు వెళ్లిన ఓ బాలుడు స్టార్ అయ్యాడు. తండ్రితో కలిసి గ్రౌండ్‌కు వెళ్లి అక్కడ ఆడిన టేబుల్ టెన్నిస్‌లో అతని ప్రతిభ చూసిన తండ్రి అవాక్కయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: తండ్రితో సరదాగా గ్రౌండ్‌కు వెళ్లిన ఓ బాలుడు స్టార్ అయ్యాడు. తండ్రితో కలిసి గ్రౌండ్‌కు వెళ్లి అక్కడ ఆడిన టేబుల్ టెన్నిస్‌లో అతని ప్రతిభ చూసిన తండ్రి అవాక్కయ్యాడు. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన విరాట్ సాగర్‌కు చిన్నప్పటి నుండే ఆటలంటే ఇష్టం. ఒకసారి తండ్రితో సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడేందుకు వెళ్ళినప్పుడు, అతని సహజ ప్రతిభ తండ్రి దృష్టికి వచ్చింది. కొడుకు ఆటలో ఆసక్తి చూపుతాడని గమనించిన తండ్రి వెంటనే శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు నుండి విరాట్ క్రీడా ప్రపంచంలో అడుగులువేసాడు.
టేబుల్ టెన్నిస్ క్రీడలో విరాట్ దూసుకుపోతున్నాడు. 2024 - 2025 సంవత్సరానికి గాను జరిగిన స్టేట్ ర్యాంకింగ్స్ టోర్నమెంట్లలో 5 లోడ్ మెడల్స్ సాధించాడు. అంతేకాకుండా లీగ్ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తూ సుమారు10 గోల్డ్ మెడల్స్ సాధించాడు. టేబుల్ టెన్నిస్ క్రీడలో అండర్ 13లో రాష్ట్రంలోనే నం.1 ర్యాంకులో ఉన్నాడు. ఆట మొదలు పెట్టిన అతితక్కువ సమయంలో ఎక్కువ విజయాలను సాధిస్తూ ఆటలో అద్భుత ప్రతిభ చూపుతున్నాడు. తన తండ్రి క్రికెట్ ప్లేయర్ అవ్వడంతో, మొదట్లో కూకట్పల్లిలోని పింగ్ పాంగ్ అకాడమీకి తన తండ్రితో పాటూ వెళ్లి సరదాగా ఆడుతున్నపుడు, తనతండ్రి విరాట్ లోని అద్భుత నైపుణ్యం గమనించి శిక్షణ ఇప్పించారు.
తన అద్భుత ప్రదర్శనతో ప్రాక్టీస్‌తో 2024లో జాతీయ టోర్నమెంట్ లో సుచేత్ అనే జాతీయ క్రీడాకారుడిపై విజయం సాధించి మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు. మొదట్లో శుభంకర్ కోచ్ వద్ద ప్రాక్టీస్ ప్రారంభించాడు. తరవాత స్థాయి కోచింగ్ సోమనాథ్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో ప్రముఖ అంతర్జాతీయ కోచ్ మనాథ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. చిన్నతనంతో సీనియర్ క్రీడాకారులతో సమానంగా పోటీ పడి అద్భుత విజయాలు సాదిస్తున్నాడు. జాతీయస్థాయి స్వర్ణం సాధించి భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు విరాట్ చెబుతున్నాడు.






