జూలై 1 నుంచి చెత్తను వేరు చేసి ఇవ్వాలి : కలెక్టర్

by Taduka Kalyani |

జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో చెత్త వేరు చేసి తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.

జూలై 1 నుంచి చెత్తను వేరు చేసి ఇవ్వాలి : కలెక్టర్
X

దిశ, మెదక్ ప్రతినిధి: జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో చెత్త వేరు చేసి తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘన వ్యర్థాల నిర్వహణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జులై ఒకటో తేదీ నుంచి చెత్తను వేరు చేయకుండా ఇవ్వరాదన్నారు. ఇండ్లలోని వ్యర్థాలను తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, పొడి చెత్తను బ్లూ డబ్బాలో, సానిటరీ చెత్తను రెడ్ డబ్బాలో, హానికరమైన చెత్తను బ్లాక్ డబ్బాలలో విడదీసి, వేరువేరుగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోటల్స్, హాస్టల్స్, పరిశ్రమలు, రెస్టారెంట్లు, ధాబాలు, హాస్పిటల్స్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సొంతంగా వ్యర్థాల నిర్వహణ చేసుకోవాలన్నారు. వాటన్నింటికీ ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్త సేకరణ కోసం నాలుగు వేరు వేరు డబ్బాలు ఏర్పాటు చేయాలన్నారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 అమలుకు కార్యాచరణ.. శాఖల సమన్వయం తప్పనిసరి జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలు-2026 ను సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story