- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Solar: దేశంలో 125 శాతం పెరిగిన రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు
ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 23.5 గిగావాట్లకు చేరుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మెర్కామ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో 2.7 గిగావాట్ల కొత్త రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ఇది గతేడాదితో పోలిస్తే 125 శాతం అధికం కావడం విశేషం. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 23.5 గిగావాట్లకు చేరుకుంది. ఈ రికార్డు స్థాయి వృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన' పథకం ప్రధాన మద్దతుగా నిలిచింది. దేశంలో ఉన్న ఇళ్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందించడం, అనుమతుల ప్రక్రియ సులభతరం కావడం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు పెరగడం వల్ల భారీగా కొత్త ఇన్‌స్టాలేషన్‌లు నమోదయ్యాయి. సమీక్షించిన త్రైమాసికానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్‌లలో 82 శాతం వాటా గృహ రంగానిదే కాగా, మహారాష్ట్ర (17 శాతం), ఉత్తరప్రదేశ్ (16 శాతం), గుజరాత్ (15 శాతం) అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం ఇన్‌స్టాల్డ్ సామర్థ్యంలో కూడా గుజరాత్ తొలి స్థానంలో కొనసాగుతోంది.
అయితే పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వేగంగా అనుమతులివ్వడం, సులభ రుణాలు, నాణ్యమైన ఇన్‌స్టాలేషన్‌లు, డిస్కమ్‌లతో సమన్వయం, గ్రిడ్ సామర్థ్యం వంటి అంశాలు రాబోయే వృద్ధిని నిర్ణయిస్తాయి. మరోవైపు, సోలార్ సెల్స్‌కు అమలు కానున్న అప్రూవ్‌డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్(ఏఎల్ఎంఎం) నిబంధనలు వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెర్కామ్ ఇండియా పేర్కొంది.






