ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అరెస్ట్

by Kodari Anjali |

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేయడంతో హనుమకొండలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అరెస్ట్
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏకశిలా పార్క్ నుండి వామపక్షాల నాయకులు ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుండగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో స్టేషన్ కు తరలిస్తుండగా అరెస్ట్‌ను నిరసిస్తూ వామపక్షాల నాయకులు పోలీస్ వాహనానికి అడ్డు తగలడంతో పోలీసులకు వామపక్షా నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ... అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Next Story