కలపడం తప్ప.. విడగొట్టడం రాదు: కుల రాజకీయాలపై పవన్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 09:14:05  IST  )

తనకు కలపడం తప్ప విడగొట్టడంరాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార కమిటీ కార్యచరణ సమావేశంలో పాల్గొన్న ఆయన తాను కుల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకుల చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ...

కలపడం తప్ప.. విడగొట్టడం రాదు: కుల రాజకీయాలపై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తనకు కలపడం తప్ప విడగొట్టడంరాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార కమిటీ కార్యచరణ సమావేశంలో పాల్గొన్న ఆయన తాను కుల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అసలు కులాలతో రాజకీయాలే చేయనని, ఎప్పటికీ చేయబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అన్ని కులాలను కలుపుని ముందుకు వెళ్తానని, అప్పుడే మనుగడ ఉంటుందని తెలిపారు. రాజకీయాల్లో కుల ప్రస్తావన ఉండకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పిల్లలందరికీ ఒకే హాస్టల్ ఉండాలి..

ఎస్టీ, ఎస్సీ, బీసీల పేరుతో దేశంలో ఎక్కడా కూడా హాస్టళ్లు ఉండకూడదని, పిల్లలందరికీ ఒకటే ఉండాలని పవన్ ఆకాంక్షించారు. పార్టీలో 18 వేల మంది సాధక్‌లు ఉన్నారని, పార్టీకోసం పని చేసేవారికి మాత్రమే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. క్షత్రస్థాయి పని చేసే కార్యకర్తను గుర్తిస్తామన్నారు. పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు పారదర్శకంగా సమాచారాన్ని అందించడమే కమిటీ బాధ్యత అని చెప్పారు. కమిటీల ఎంపికపై విమర్శలు సరికాదన్నారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జనసేన కోసం నిస్వార్థంగా పని చేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తే మరిన్ని పదవులు ఇస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story