- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు జెర్రిపోతుల సయ్యాట.. నెట్టింట వైరల్!
by Jakkula.Mamatha |
జడ్చర్ల పట్టణంలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటానికల్ గార్డెన్‌లో శనివారం ఉదయం రెండు జెర్రిపోతు పాముల సయ్యాట(కంబాట్ ఫైటింగ్) ఆకట్టుకుంది.

X
దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటానికల్ గార్డెన్‌లో శనివారం ఉదయం రెండు జెర్రిపోతు పాముల సయ్యాట(కంబాట్ ఫైటింగ్) ఆకట్టుకుంది. సాధారణంగా మే, జూన్, జూలై నెలల్లో జెర్రిపోతులకు ప్రత్యుత్పత్తి కాలం. ఈ సమయంలో ఆడ పాము విడుదల చేసే 'ఫిరమోన్' అనే రసాయన వాసనకు ఆకర్షితమై మగ పాములు వస్తాయి. ఒకటి కంటే ఎక్కువ మగ పాములు వచ్చినప్పుడు ఆడ పాము కోసం వాటి మధ్య పోటీ నెలకొంటుంది. ఇందులో భాగంగా రెండు మగ పాములు ఒకదానికొకటి పెనవేసుకుని, శరీర ముందరి భాగాన్ని పైకి లేపుతూ గంటల తరబడి పోరాడుతాయి. దీనినే శాస్త్రీయంగా 'కంబాట్ ఫైటింగ్' అంటారని సర్ప రక్షకుడు డాక్టర్ బి. సదాశివయ్య తెలిపారు. ఈ పోటీలో గెలిచిన పామే ఆడ పాముతో జతకడుతుందని, వర్షా కాలం ఆరంభంలో ఇలాంటి దృశ్యాలు సహజంగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Next Story






