- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రణరంగంగా మారిన వాతావరణం
అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఉండవల్లి వద్ద పేర్ని నాని, అంబటి రాంబాబు బృందాన్ని అడ్డుకున్న రైతులు, టీడీపీ నేతలు.. తోపులాటలో పోలీస్ అధికారికి గాయాలు.

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలోని ఉండవల్లి (undavally)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేతల రాఖను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, రైతులు, నిరసన కారులు భారీ ఎత్తున రావడంతో పరిస్థితి మారిపోయింది. వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటి నేతలు అమరావతికి భయలు దేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉండవల్లి వద్ద వైసీపీ శ్రేణులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుకుంది. ఇది గమనించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఓ పోలీస్ అధికారి స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు వైసీపీ నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉండవల్లి ప్రాంతం మొత్తం నిరసన కారులు, పోలీసులు, వైసీపీ నేతలతో రణరంగంగా మారిపోయింది.
కోడిగుడ్లతో దాడి.. కారు ధ్వంసం
వైసీపీ నేతల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, ఉండవల్లి రైతులు వైసీపీ నేతలపైకి పెద్ద ఎత్తున కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. నిరసనకారుల దాడిలో వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కి సంబంధించిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, పరస్పర దాడులు జరగడంతో ఉండవల్లి జాతీయ రహదారి యుద్ధభూమిని తలపించింది.ః
పోలీసులు, సీఆర్డీఏ బృందంపై రాళ్లవర్షం
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులను, సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు, నిరసన కారులు భారీగా రాళ్లు రువ్వారు (Stone Pelting). ఈ రాళ్ల దాడిలో డ్యూటీలో ఉన్న పలువురు పోలీసు అధికారులకు, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను, సిబ్బందిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమరావతి వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు లాఠీఛార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






