మ్యూజికల్ జర్నీ షురూ.. ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

by Mallepaka Hamsa |

అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు.

మ్యూజికల్ జర్నీ షురూ.. ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. గత కొద్దికాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో, ఈసారి ఎలాగైనా ఒక భారీ కంబ్యాక్ హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఆయన తన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ కోసం తెగ కష్టపడుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర ఈ చిత్రంలో రవితేజ కూతురి పాత్రలో కనిపించబోతుండగా, సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. మొదటి పాట విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ అని సాగే ఈ పాటను జూన్ 29న ఉదయం 11:07గంటలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రవితేజ అయ్యప్ప స్వామి మాలలో పూజ చేస్తున్న పోస్టర్‌ను షేర్ చేసి ఆసక్తిని రేకెత్తించారు. రవితేజను ఇలాంటి భక్తిరస పాత్రలో చూడటం ఫ్యాన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తోంది.

Next Story