మూడు సినిమాలను ఒకేసారి మేనేజ్ చేయనున్న మహేష్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్

by Pulgam srinivas |

'వారణాసి'తో పాటు 'రావు బహదూర్' ప్రమోషన్స్, 'శ్రీనివాస మంగాపురం' ఈవెంట్‌లతో మహేష్ బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

మూడు సినిమాలను ఒకేసారి మేనేజ్ చేయనున్న మహేష్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'వారణాసి' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల ప్రమోషన్లలో కూడా మహేష్ పాల్గొననున్నట్లు సమాచారం. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై తొలి వారంలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై తన సోదరుడి కుమారుడు జయకృష్ణను ప్రోత్సహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక మహేష్ బాబు, సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన మహేష్, సోషల్ మీడియా వేదికగా మూవీపై ప్రశంసలు కురిపించగా ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగే సినిమా విడుదలకు ముందు 'రావు బహదూర్' ప్రమోషన్లలో భాగంగా ఒకటి లేదా రెండు ఇంటర్వ్యూలలో కూడా మహేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఒకవైపు 'వారణాసి' షూటింగ్, మరోవైపు 'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే 'రావు బహదూర్' ప్రమోషన్లతో మహేష్ బాబు ఏకకాలంలో మూడు సినిమాల పనులతో బిజీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story