- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి అకృత్యాలు బయటకు రాకూడదనే దాడి: పేర్ని నాని
అమరావతి లోపాలు బయటపడతాయనే చంద్రబాబు, లోకేష్ దాడులు చేయించారు.. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలన్న పేర్ని నాని!

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి వద్ద వైసీపీ నేతల బృందం పై జరిగిన దాడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని భూముల పరిశీలనకు వెళ్లిన తమపై తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. అమరావతి పరిధిలో జరుగుతున్న అకృత్యాలు, అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముందస్తు వ్యూహంతోనే ఈ దాడులు చేయించారని పేర్ని నాని విమర్శించారు.
తాము శాంతియుతంగా పర్యటించడానికి వెళ్లిన తమపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి తెగబడిన గుండాలపై, తమను అంతమొందించాలని చూసిన వారిపై తక్షణమే హత్యాయత్నం (Attempt to Murder) కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారుతో పాటు తమ వాహనాలను పూర్తిగా ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.






