- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులా భూకంపంలో మరో అద్భుతం.. మృత్యువును జయించిన 18రోజుల చిన్నారి
వెనిజులాలో 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన భూప్రకంపనలు వేలాది మందిని నిరాశ్రయుల్ని చేశాయి. ఈ తరుణంలో కొన్ని ఘటనలు భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వెనిజులాలో 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన భూప్రకంపనలు వేలాది మందిని నిరాశ్రయుల్ని చేశాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినవారిని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి క్షణాల్లో కొన్ని ఘటనలు రేపటి భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. నిన్న భూకంప శిథిలాల మధ్య.. మానవత్వమే మంత్రసానిగా మారి.. ఓ ప్రాణానికి పురుడుపోసిన వీడియో నెట్టింట వైరల్ అయింది. నేడు మరో చిన్నారి శిథిలాల కింద రెండురోజులుగా ఉన్నా.. మృత్యుంజయురాలిగా బయటికొచ్చింది. 18 రోజుల చిన్నారి ఏడుపు విన్న రెస్క్యూ సిబ్బంది.. ఆ చిన్నారిని ఎంతో జాగ్రత్తగా బయటికి తీసి తండ్రికి అప్పగించగా.. ఆ తండ్రి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తుండగా.. సహాయక సిబ్బందికి పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అప్రమత్తమయిన రెస్క్యూ టీమ్.. కాంక్రీట్ దిమ్మెల్ని జాగ్రత్తగా తొలగించి.. 18 రోజుల పసికందును క్షేమంగా బయటకు తీశారు. ఊపిరి బిగపట్టి తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తండ్రికి ఆ బిడ్డను అప్పగించగా.. గుండెలకు హత్తుకుని ఏడ్చిన తీరు అక్కడున్నవారందరినీ కదిలించింది. చుట్టూ ఉన్నవారంతా ఆ బిడ్డను జాగ్రత్తగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్ ను చప్పట్లతో అభినందించారు. 90 నిమిషాల తర్వాత.. అదే శిథిలాల కింద బిడ్డ తల్లిని కూడా ప్రాణాలతో రక్షించారు. ఎంతో విషాదంలో శిథిలాల నుంచి సజీవంగా తల్లి, బిడ్డ బయటికి రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేవుడి మహిమ.. నిజమైన మిరాకిల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి.. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సహాయక సిబ్బందిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.






