- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అఖిల భారత పులుల లెక్కింపు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అఖిల భారత పులుల లెక్కింపు వివరాల్ని జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర ఐఎఫ్ఎస్ తెలిపారు.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అఖిల భారత పులుల సెన్సెస్‌ను (All India Tiger Estimation - AITE) 2026 కార్యక్రమం 2025 నవంబర్ నుండి 2026 జూన్ వరకు ఎనిమిది నెలల పాటు విజయవంతంగా ఈ సర్వే మొత్తం 2,611 చ.కి.మీ. విస్తీర్ణంలో పూర్తి చేశారని జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర ఐఎఫ్ఎస్ శనివారం మీడియాకు తెలిపారు. ఈ సర్వేను క్రమబద్ధంగా నిర్వహించేందుకు రిజర్వ్‌ను 2 చ.కి.మీ గ్రిడ్‌లుగా విభజించామన్నారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వేను నాలుగు బ్లాక్‌లుగా నిర్వహించగా ప్రతి బ్లాక్‌లో కెమెరాలు 30 రోజుల పాటు పరిశీలనతో సర్వే జరిగిందన్నారు
రిజర్వు టైగర్ అడవుల్లో 42 పెద్ద పులులు..
అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో సెన్సెస్ ప్రకారం.. 42 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. వీటిలో 18 ఆడ పులులు,14 మగ పులులు, 2 ఉప-వయోజన (Sub-adult) పులులు 8 పులి పిల్లలు (Cubs) గా ప్రాథమిక అంచనా గుర్తించబడ్డాయన్నారు. ఈ లెక్కింపును శాస్త్రీయంగా ఎన్ టి సి ఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ సూచనలు మేరకు చాలా పకడ్బందీగా నిర్వహించామన్నారు.
సెన్సెస్ వీరి పర్యవేక్షణలో..
పెద్దపులుల సెన్సెస్ ఈ కార్యక్రమాన్ని డా. సునీల్ ఎస్. హిరేమత్, IFS (ఫీల్డ్ డైరెక్టర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), రేవంత్ చంద్ర, IFS (జిల్లా అటవీ అధికారి, నాగర్‌కర్నూల్) పర్యవేక్షించారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారులు, రేంజ్ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అలాగే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు మరియు హైటికోస్ (Hyticos) బృందం సాంకేతిక, పరిశోధనా సహకారం అందించింది. ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనా కార్యక్రమంలో కీలక భాగంగా నిలిచి, పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాస్త్రీయ సమాచారాన్ని సేకరించిందన్నారు.
నల్లమల్ల పులులకు ఆరోగ్యకరమైన ప్రాంతం..
అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో పులి పిల్లలు, ఉప-వయోజన పులుల ఉనికి, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల విజయవంతమైన సంతానోత్పత్తి కొనసాగుతోందని, ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని సూచిస్తోంది. ఈ అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా పూర్తికావడం అటవీ అధికారులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది. ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ, శాస్త్రీయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తుందన్నారు.






