- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మల్ని అడ్డుకుంది వాళ్లే... రైతులు కాదు: మాజీ మంత్రి అంబటి ఆగ్రహం
తమను అడ్డుకుంది టీడీపీ వాళ్లేనని, రైతులు కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి ప్రాంతం ఉండవల్లిలో భూసేకరణను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: తమను అడ్డుకుంది టీడీపీ గూండాలేనని, రైతులు కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి ప్రాంతం ఉండవల్లిలో భూసేకరణను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడుల చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మంత్రి ఫైర్
అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) నేతల దాడుల వెనుక మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఉన్నారని ఆరోపించారు. రైతుల ముసుగులోనే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల దాడులను తాము లెక్కచేయమన్నారు. దాడులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. చంద్రబాబు గొడ్డలిని లోకేశ్ చేతిలో పెట్టారని ఎద్దేవా చేవారు. లోకేశ్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎవరెంత అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడతామన్నారు. రైతుల విజ్ఞప్తితోనే జగన్ పరిరక్షణ కమిటీ వేశారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేశారని, అందుకే వెళ్లామన్నారు. ‘‘మాది గొడ్డలి పార్టీ అయితే.. తన్నులు తింటామా?. గొడ్డలి పార్టీ ఎవరిదో ఇప్పుడు చంద్రబాబు చెప్పాలి.’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.






