- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్మార్ట్ కిచెన్’ పేరుతో మధ్యాహ్న భోజన కార్మికుల పొట్ట కొడుతున్నారు: వైఎస్ జగన్
మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం.. ‘స్మార్ట్ కిచెన్స్’ పేరుతో 85 వేల మందిని తొలగించే కుట్రపై వైఎస్ జగన్ ఆగ్రహం!

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్’ పేరుతో మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొడుతున్నారని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో "ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది మహిళా కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన.. రాష్ట్రంలో 'స్మార్ట్ కిచెన్స్' (Smart Kitchens) పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకువస్తూ, గత 20 ఏళ్లకు పైబడి పాఠశాలల్లోనే నమ్ముకుని పనిచేస్తున్న నిరుపేద మహిళలను రోడ్డున పడేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. స్మార్ట్ కిచెన్స్ పేరిట తమ సొంత పార్టీ నాయకులకు, అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తూ వారి పొట్టలు నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించిన జగన్.. ఇందులో భాగంగానే వీరికి అందాల్సిన గత రెండు నెలల జీతాలను (Salaries) కూడా ప్రభుత్వం బకాయిలు పెట్టడం దారుణమన్నారు.
గతంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం రూ. 1,000 ఉన్న గౌరవ వేతనాన్ని తాము అధికారంలోకి రాగానే రూ. 3,000కు పెంచామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ మహిళా కార్మికులకు ఇంకా మేలు చేస్తామని, జీతాలు పెంచుతామని నమ్మబలికిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ మధ్యాహ్న భోజన కార్మికుల పక్షాన నిలబడుతుందని, వారి హక్కుల కోసం గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గత రెండు నెలలుగా బకాయి పెట్టిన వేతనాలను విడుదల చేయాలని, అలాగే ఎన్నికల హామీ మేరకు వారి జీతాలను తక్షణమే పెంచాలని వైఎస్ జగన్ గట్టిగా డిమాండ్ చేశారు.






