ఒకే కులమని వెనకేసుకురావడం సరికాదు: సాయికృష్ణ కేసుపై పవన్ రియాక్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-27 09:12:41  IST  )

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కరుడుకట్టిన నేరస్థుడు సాయికృష్ణ అని, అతనిని ఎలా వెనకేసురావాలన్నారు.

ఒకే కులమని వెనకేసుకురావడం సరికాదు: సాయికృష్ణ కేసుపై పవన్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌(Vijayawada Krishnalanka Police Station)లో సాయికృష్ణ లాకప్ డెత్(Sai Krishna Lockup Death) అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. కరుడుకట్టిన నేరస్థుడు సాయికృష్ణ అని, అతనిని ఎలా వెనకేసురావాలన్నారు. సాయికృష్ణ తల్లి బాధను అర్ధం చేసుకోగలననని చెప్పారు. కులానికి సంబంధించిన వ్యక్తి కావడంతో నిందితుడిని వెనుకేసుకురావడం సరికాదని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇంటి గడపలోపలే కులం ఉండిపోవాలని, బయటకు రాకూడనేదే తన అభిప్రాయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాపు నేతలతో తిట్టిస్తున్నారు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తనను కాపు నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓ సామాజికి వర్గానికి చెందిన గ్రూప్ కాదని, అది ఒక వర్గానికి చెందిన గ్రూప్ అని వ్యాఖ్యానించారు. అధికారం కోసం వాళ్లు దేనినైనా వివాదం చేస్తారని తెలిపారు. రాజకీయాల కోసం కులం, మతం వంటి అంశాలను తీసుకొస్తారని విమర్శించారు. కులం కార్డుతో రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story