శంషాబాద్ విమానాశ్రయం వద్ద చిరుత కలకలం!

by Ramesh Naini |   (  Updated:2026-06-27 10:31:40  IST  )

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని చిన్మయ విద్యాలయ పరిసరాల్లో శనివారం ఉదయం చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శంషాబాద్ విమానాశ్రయం వద్ద చిరుత కలకలం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని చిన్మయ విద్యాలయ పరిసరాల్లో శనివారం (జూన్ 27) ఉదయం చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపినట్లు వార్తలు వినిపించాయి. పాఠశాల సమీపంలో చిరుత సంచరించిన ఆనవాళ్లను గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, పరిసరాలను పరిశీలించి ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

అయితే.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. చిన్మయ స్కూల్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.

Next Story