- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిట్ కాంబో రిపీట్.. అల్లు అర్జున్ ‘రాకా’లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ ఈ సినిమాలో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు టాక్.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విజువల్ వండర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అట్లీ గత చిత్రం ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు అంతకుమించి ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా, ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ ఈ సినిమాలో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు టాక్.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ముంబైలో జరగబోయే తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో రష్మిక కూడా జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో దీపికాతో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించబోతున్నట్లు టాక్. ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తుండటంతో అట్లీ ఏదో పెద్ద మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్రబృందం శరవేగంగా పని చేస్తోంది. ఆ తర్వాత భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.






