- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆ పని చేసి ఉంటే ఇప్పటికే రూ.100 కోట్లు సంపాదించే వాడిని... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సత్యదేవ్
విలన్ పాత్రలు చేస్తే రూ.100 కోట్లు సంపాదిస్తావని చాలామంది చెప్పారని సత్యదేవ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావ్ బహదూర్' చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడుతూ.. "కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు చేశాను. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాను. ఒక దశలో కొంతమంది 'విలన్ పాత్రలు చేస్తే చాలా త్వరగా రూ.100 కోట్లు సంపాదిస్తావు' అని చెప్పారు. కానీ నాకు డబ్బు కంటే హీరోగా కొనసాగడమే ముఖ్యమని అనిపించింది" అని తెలిపారు.
అలాగే, "మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి 'గాడ్ ఫాదర్' సినిమాలో విలన్ పాత్రలో నటించిన సమయంలో ఆయన నాకు ఒక విలువైన సలహా ఇచ్చారు. 'ఇప్పుడు నా సినిమాలో విలన్‌గా నటిస్తున్నావు కాబట్టి చాలామందికి నీ ముఖం గుర్తుంటుంది. దీంతో నీకు మంచి నిర్మాతల నుంచి హీరోగా అవకాశాలు వస్తాయి. ఇకపై విలన్ పాత్రలు చేయకు. అలా చేస్తే అదే తరహా పాత్రలకే పరిమితమైపోతావు' అని చెప్పారు. నా భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఆ సలహా ఇచ్చారు. అది నాకు కూడా ఎంతో నచ్చింది. అందుకే రూ.100 కోట్ల కంటే హీరోగా కొనసాగడానికే నేను ప్రాధాన్యం ఇచ్చాను" అని సత్యదేవ్ చెప్పారు. అలాగే 'జీబ్రా' సినిమా నిర్మాతలు కూడా 'గాడ్ ఫాదర్'లో తన నటన చూసే తనను సంప్రదించారని సత్యదేవ్ వెల్లడించారు.






