- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రౌడీ జనార్ధన్' రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్.. ఆ నెలలోనే విడుదల?
'రౌడీ జనార్ధన' చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంతో పాటు రౌడీ జనార్ధన అనే మూవీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక రౌడీ జనార్ధన సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుండి కొంత కాలం క్రితం అదిరిపోయే యాక్షన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులోని విజయ్ లుక్, డైలాగ్స్ అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలపై పెద్దగా ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.
తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ బరిలో నిలపాలని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు, అందుకు అనుకూలంగా ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరి కొంత కాలంలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనుండగా, విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నాడు.






