హస్మత్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. పోలీసు బందోబస్తులో హైడ్రా చర్యలు

by Jakkula.Mamatha |

హస్మత్‌పేట్ సర్వే నంబర్–1లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.

హస్మత్‌పేట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. పోలీసు బందోబస్తులో హైడ్రా చర్యలు
X

దిశ, బాలానగర్: హస్మత్‌పేట్ సర్వే నంబర్–1లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు. పురావస్తు శాఖకు చెందిన భూమిని కొంతకాలంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలకు దిగారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలపై చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Next Story