- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక్కడ విద్యార్థులకు తరగతి గదిలోనే డార్మెటరీ..!
ఉత్తమ ఫలితాలు సాధనలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు సౌకర్యాల లేమి కొట్టుమిట్టాడుతుంది.

దిశ, ఏన్కూర్: ఉత్తమ ఫలితాలు సాధనలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు సౌకర్యాల లేమి కొట్టుమిట్టాడుతుంది. మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు ప్రధానంగా డార్మెటరీ సౌకర్యం లేక వర్షం వచ్చిందంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చదువుతున్న ఏడో తరగతి విద్యార్థులు తరగతి గదిలోని డార్మెటరీగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు పడుకోవడానికి డార్మెటరీ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు సిఫార్సు చేసిన లెటర్లతో పాటు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విద్యార్థులకు సీట్ సౌకర్యం కల్పించాలని లేఖలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సమస్యలు వర్ణనాతీతం అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






