- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొట్టిన కారు.. తహసీల్దార్ రమేష్ గౌడ్‌కు తీవ్ర గాయాలు!
కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామ శివారులో గత రెండు సంవత్సరాల్లో సుమారుగా ఆరుగురు వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోయారు.

దిశ, కథలాపూర్: కథలాపూర్ మండల్ పోసానిపేట గ్రామ శివారులో గత రెండు సంవత్సరాల్లో సుమారుగా ఆరుగురు వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోయారు. వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా ఈ రోడ్డులో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అదే స్పాట్‌లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో వేములవాడ నుంచి కథలాపూర్ మండల కేంద్రానికి తన విధుల్లో భాగంగా కథలాపూర్ తహసీల్దార్ గుగ్గిళ్ల రమేష్ గౌడ్ ప్రయాణం చేస్తున్న కారు అదుపుతప్పి పోసానిపేట గ్రామ శివారులోని చెట్టును ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు బలంగా చెట్టును ఢీకొట్టడంతో తహసీల్దార్ రమేష్ గౌడ్ చేయి విరిగినట్లు సమాచారం.
చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా కారులో రమేష్ గౌడ్ ఒక్కరే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో కారులోని రెండు బెలున్లు ఓపెన్ అయ్యాయి. అయితే హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఈ రూట్లో వెళితే ప్రయాణానికి సమయం కలిసి రావడం తో పాటుగా అనుకూలంగా ఉంటుందని చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. నిత్యం కోరుట్ల -వేములవాడ ప్రధాన రహదారి పై జరుగుతున్న వరుస ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా మూల మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు తగిన ఏర్పాట్లు ఆర్ అండ్ బి అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుకుంటున్నారు.






