- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి తమిళనాడు సీఎం విజయ్? కాకినాడ హోర్డింగులపై క్లారిటీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత వచ్చింది. కాకినాడలోని కేఐఈటీ (KIET) కాలేజీ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు, ఇందుకు సంబంధించి అక్కడ భారీ హోర్డింగులు వెలిసినట్లు వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. సీఎం విజయ్‌ను కాలేజీ యాజమాన్యం అధికారికంగా ఆహ్వానించినట్లు కానీ, ఆయన ఏపీ పర్యటన ఖరారైనట్లు కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలుస్తోంది. కాగా, తెలుగులో రాష్ట్రాల్లో సీఎం విజయ్‌ను పొలిటికల్, సినిమాల పరంగా చాలా మంది అభిమానించే వారు ఉన్న విషయం తెలిసిందే.
చురుగ్గా నూతన సీఎం నిర్ణయాలు..
ఇదిలా ఉండగా.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సూపర్ స్టార్ విజయ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి పసిబిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా అందించేలా ఆయన ప్రభుత్వం ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది.






