ఉప్పల్ బాలు ప్రమాదకర స్టంట్లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

by Malleboina Mahesh |

వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఉప్పల్ బాలు థార్ కారు స్టంట్లు.. రీల్స్ వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు!

ఉప్పల్ బాలు ప్రమాదకర స్టంట్లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు (Uppal Balu)కు అనంతగిరి ఫారెస్ట్ అధికారులు (Forest officials) ఊహించని షాక్ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ‘ఉప్పల్ బాలు’ చేసిన వింత చేష్టలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. దట్టమైన అటవీ ప్రాంత రహదారులపై వేగంగా వెళ్తున్న ఒక మహీంద్రా థార్ (Thar) కారు బోనెట్, టాప్‌పై కూర్చొని ఉప్పల్ బాలు ప్రమాదకరమైన రీతిలో స్టంట్లు చేస్తూ రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన పుణ్యక్షేత్ర వాతావరణాన్ని అప్రతిష్టపాలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన బాలు, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై వికారాబాద్ అటవీ శాఖ (Forest Department) అధికారులు తక్షణమే స్పందించారు. అభయారణ్య పరిధిలోకి వచ్చే అనంతగిరి కొండల్లో ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. ఉప్పల్ బాలుపై అధికారికంగా కేసు నమోదు (Case Registered) చేసినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. ఈ రీల్స్ కోసం వాడిన కారును గుర్తించి, దానికి సంబంధించిన వారిని కూడా విచారించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలా పర్యావరణానికి, పర్యాటకుల భద్రతకు ముప్పు తెచ్చే పనులు చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Next Story