Satya Dev: ఆ పాన్ ఇండియా సినిమా నుంచి నా సీన్స్ తొలగించారు

by Pulgam srinivas |

'ఆర్ఆర్ఆర్' సినిమాలో నేను నటించాను.. కానీ నా సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయాయని సత్యదేవ్ తెలిపారు.

Satya Dev: ఆ పాన్ ఇండియా సినిమా నుంచి నా సీన్స్ తొలగించారు
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ తాజాగా 'రావ్ బహదూర్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, "మీరు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారనే వార్తలు వచ్చాయి. అది నిజమేనా?" అని ప్రశ్నించగా, సత్యదేవ్ స్పందిస్తూ.. "అవును, నేను ఆ సినిమాలో నటించాను. అయితే నా సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలగిపోయాయి.

అయినప్పటికీ నాకు ఎలాంటి బాధ లేదు. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో రాజమౌళి గారు ఒకరు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదే నాకు పెద్ద అనుభవం" అని చెప్పారు. ఇక 'రావ్ బహదూర్' చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Next Story