నివిన్ పౌలీ ‘NP-50’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన రిషబ్ శెట్టి

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-27 09:11:34  IST  )

ఈ సినిమాలో నివిన్ పౌలీ ఒక బైక్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌తో హింట్ ఇచ్చారు మేకర్స్.

నివిన్ పౌలీ ‘NP-50’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన రిషబ్ శెట్టి
X

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన ‘ప్రేమమ్’ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. మలయాళ యంగ్ హీరో నివిన్ పౌలీ, అల్ఫోన్స్ పుత్రేన్ కాంబోలో ‘NP-50’ వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రేమమ్ ఎంతటి సంచలన విషయాన్ని సృష్టించిందో.. ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత నివిన్, పుత్రేన్ కలిసి పని చేస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి చేతుల మీదుగా చిత్రబృందం అధికారికంగా లాంచ్ చేయించింది. ఈ చిత్రానికి ‘విజయం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయంపై నివిన్ పౌలీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న నమ్మకంతోనే మొదలవుతుంది.. మనతో పాటు ఆ ప్రయాణంలో మొదటి అడుగు వేయడానికి ఎవరో ఒకరు తోడుండాలి. నాతో కలిసి ఈ జర్నీని ప్రారంభించిన ఆ స్నేహితుడితో మళ్లీ’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా తమిళ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.

కాగా.. నేరం, ప్రేమమ్ చిత్రాల తర్వాత నివిన్, పుత్రేన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.ఇక విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమాలో నివిన్ పౌలీ ఒక బైక్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌తో హింట్ ఇచ్చారు మేకర్స్. రేసింగ్ బైక్ ముందు స్టైలిష్‌గా నిలబడి, చేతిలో హెల్మెట్ పట్టుకున్న నివిన్ పౌలీ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో అల్ఫోన్స్ పుత్రేన్ మార్క్ స్క్రీన్ ప్లేతో పాటు అదిరిపోయే యాక్షన్, స్పీడ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాన్సన్ టోనీ, సునీల్ రామడీ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో నివిన్, అల్ఫోన్స్ కాంబోలో వచ్చిన ‘ప్రేమమ్’ కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం ఒక ట్రెండ్ సెట్ చేసింది. మరి ఇప్పుడు రాబోతున్న ఈ ‘విజయం’ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Next Story