- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ప్రక్రియ పై అపోహలు వద్దు: డిప్యూటీ తహసీల్దార్ సఫియొద్దీన్
by Jakkula.Mamatha |
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కొనసాగుతోంది.

X
దిశ, ఆత్మకూరు(ఎం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ఓటర్లు ఫారంలో కోరిన వివరాలను పూర్తిగా నమోదు చేసి, ఫొటో అతికించి బీఎల్‌వోలకు అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ సఫియొద్దీన్ సూచించారు. ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు, ఆందోళన అవసరం లేదని తెలిపారు. మండలంలోని పల్లెర్ల గ్రామం 291, 292 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న పత్రాల పంపిణీని పరిశీలించారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరుకు పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






