ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప వరద

by Jakkula.Mamatha |

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కువ భాగం నుంచి స్వల్ప వరద వచ్చి చేరుతుంది.

ఎస్ఆర్ఎస్పీలోకి  కొనసాగుతున్న స్వల్ప వరద
X

దిశ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కువ భాగం నుంచి స్వల్ప వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు 579 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, శనివారం నాటికి 1064.10 అడుగులు ఉంది. 14.910 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 250, ఎస్కేప్ గేట్ల ద్వారా, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ఆవిరి రూపంలో 286 క్యూసెక్కుల నీరు తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story