- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంజారాహిల్స్ జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీషీటర్ వీరంగం
బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీషీటర్ వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది.

దిశ, ఖైరతాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీషీటర్ వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో షోరూమ్‌లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మేనేజర్‌ను కత్తితో బెదిరించి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌కు అలీమ్, యూనస్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడి మేనేజర్ పంకజ్ బండ్గర్ను బెదిరించారు. వారు కత్తి చూపిస్తూ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా తర్వాత వచ్చినప్పుడు డబ్బు రెడీగా ఉంచాలి అంటూ హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో తాను, షోరూమ్ సిబ్బంది ప్రాణభయంతో ఉన్నామని, నిందితులు తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని మేనేజర్ పంకజ్ బండ్గర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులు అలీమ్, యూనస్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






