ఎన్యూమరేషన్ ఫారాలను మీరే నింపాలంటున్న బీఎల్వోలు.. తప్పులుంటే బాధ్యులు ఎవరు?

by Jakkula.Mamatha |

గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాల ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు.

ఎన్యూమరేషన్ ఫారాలను మీరే నింపాలంటున్న బీఎల్వోలు.. తప్పులుంటే బాధ్యులు ఎవరు?
X

దిశ,మక్తల్: గత రెండు రోజులుగా బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాల ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేశారు. ఇచ్చిన ఫారాలని మీరే నింపాలని, రెండు రోజుల్లో తిరిగి ఇవ్వాలని అనడం వాటిని ఎలా నింపాలో తమకు తెలియదని అందులో ఉండే సందేహాలను ఎవరు నివృత్తి చేస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. గత మూడు దఫాలుగా తహసీల్దార్ అధ్యక్షతన బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ పై ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్‌లో ఇచ్చిన ఫారాలను ఓటర్ల దగ్గరుండి నింపేందుకు చొరవ తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ఓ ఇంట్లో చదువురాని వారుంటే ఫారాలు ఎలా నింపుతారని సందేహం వ్యక్తం చేశారు. బీఎల్వోలకు పంపిణీ చేసిన ఫారాలను వారే ఆ ఇంటికి వెళ్లి ఫారాలను నింపాలని ఆదేశంలో ఉన్న కొందరు బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మక్తల్ పట్టణంలో స్లమ్ ఏరియాలో వాదన వినిపిస్తోంది. తమ దగ్గర ఓటర్ లిస్ట్ లేదు.

పాత ఓటర్ కార్డు లేవు. నేను ఎలా నింపాలని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం మాత్రమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐర్) చేపట్టడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు ఇంటికి వెళ్లి స్వయంగా ఫారాలు అందజేసి వాటిని ఎలా నింపాలో వివరించలేదని, నింపిన ఫారాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి అందజేయాలని బీఎల్‌వోలు చెప్పడంతో ఓటర్లు విష్మయం చెందుతు తికమక పడుతున్నారు. ఫారాలు అందజేసే సమయంలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి ఓటరు పూర్తి వివరాలతో ఫారాలు నింపే బాధ్యత బిఎల్ఓ లపై ఉందని, దీనిపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్ వివరణ ఇచ్చారు.

Next Story