- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ బంగారంతో వ్యాపారికి రూ.7 లక్షల టోకరా
ఓ వ్యాపారిని నమ్మించి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు నిందితులు రూ.7లక్షలతో ఉడాయించిన ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, మీర్ పేట్: ఓ వ్యాపారిని నమ్మించి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు నిందితులు రూ.7లక్షలతో ఉడాయించిన ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్‌సాన్‌పల్లి కూడలిలో ఉన్న ఓ మార్వాడీ దుకాణానికి ఇద్దరు గుర్తు తెలియని వచ్చి తమ వద్ద 30 తులాల బంగారం ఉందని డబ్బు కావాలని వ్యాపారిని అడిగారు. తమ దగ్గర ఉన్న రెండు బంగారు కాయిన్స్ తీసి చూపించి వ్యాపారిని నమ్మించారు.
నిందితుల మాటలు నమ్మిన వ్యాపారి మరుసటి రోజు వచ్చి బంగారం విక్రయిస్తామని చెప్పి వెళ్లిపోయి మరుసటి రోజు వచ్చి బంగారానికి బదులు నకిలీ బంగారాన్ని అంటగట్టి సదరు వ్యాపారి దగ్గర ఏడు లక్షలు రూపాయలు తీసుకొని పారిపోయారు. బంగారాన్ని పరిశీలించాక వ్యాపారి నకిలీ బంగారం అని గుర్తించి లబోదిబో అంటూ తాను మోసపోయానని మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యాపారితో నిందితులు మాట్లాడుతున్న వీడియో సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఈ మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






