- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢాబాలో మహిళ అసభ్య ప్రవర్తన.. భోజనం చేసే చోట బహిరంగంగా మూత్ర విసర్జన.. వైరల్‌గా వీడియో
మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఉన్న ఒక దాబాలో అసభ్యకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఉన్న ఒక దాబాలో అసభ్యకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ, దాబాలో కస్టమర్లు భోజనం చేస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా మూత్రవిసర్జన చేసింది. ఈ అసహ్యకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. దాబాలో వాష్‌రూమ్ సౌకర్యం ఉన్నప్పటికీ సదరు మహిళ దానిని ఉపయోగించలేదు. చుట్టుపక్కల పిల్లలు, ఇతర కస్టమర్లు భోజనం చేస్తున్నారని మరో మహిళ వీడియో తీస్తూ గుర్తు చేసినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని వీడియోలో కన్పిస్తోంది.
సిబ్బందితో వాగ్వాదం..
విషయం తెలుసుకున్న దాబా మేనేజర్, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. అయితే, ఆ మహిళ తన తప్పును అంగీకరించకపోగా, కస్టమర్లు, సిబ్బందితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సివిక్ సెన్స్, పరిశుభ్రతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరి కాదని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం.. ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సదరు వ్యక్తి మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించాలని అభిప్రాయపడుతున్నారు. అయితే వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేదని, ఈ ఘటనపై అధికారుల చర్యలపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.






