ఆరేకోడు తండాలో మురుగునీటి కాలువను పరిశీలిస్తున్న సీపీఎం బృందం

by Jakkula.Mamatha |

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దళితవాడలు గిరిజన తండాలు ఇంటింటి సర్వేలో శనివారం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు

ఆరేకోడు తండాలో మురుగునీటి కాలువను పరిశీలిస్తున్న సీపీఎం బృందం
X

దిశ, ఖమ్మం రూరల్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దళితవాడలు గిరిజన తండాలు ఇంటింటి సర్వేలో శనివారం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. తండాలో ఇంతవరకు సైడ్ డ్రైనేజీ లేకపోవడం వలన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తక్షణమే సైడ్ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే తండాలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని కోరారు. తండాలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్న ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని తక్షణమే వారికి డబ్బులు ఇవ్వాలని అన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విబిజి రాంజీ బిల్లును వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జూలై 1న గ్రామ గ్రామాన పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు ధర్నాలు విజయవంతం చేయాలని వడ్లమూడి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సర్వే కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కారుమంచి గురవయ్య , సంఘం మండల ఉపాధ్యక్షులు పొన్నం భాస్కరరావు, సంఘం మండల కమిటీ సభ్యులు గడ్డం రామారావు, సంఘం గ్రామ నాయకులు కృష్ణ, భాను, రామ్ సింగ్, మూడు రాములు, సాలి, సరోజన, సుగుణ ,కీమా, గణేష్ ,హర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story