- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు.. 51 వేల మంది మిస్సింగ్!
దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో బుధవారం సంభవించిన జంట భూకంపాలు (Twin Earthquakes) సృష్టించిన భీభత్సంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ఈ నెల 24న వరుసగా రెండు భారీ భూకంపాలు (Twin Earthquakes) సంభవించాయి. ఈ జంట భూకంపాలు సృష్టించిన బీభత్సం కారణంగా నేటికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 920 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భూకంపం సంభవించి మూడు రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ఘోర ప్రకృతి విపత్తు కారణంగా వందలాది భవనాలు, అపార్టుమెంట్లు కుప్పకూలాయి. భూకంపం అనంతరం అక్కడి దృష్యాలు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుండగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన ఇళ్లు, భారీ అపార్ట్‌మెంట్ల శిథిలాల క్రింద చిక్కుకుని ఏకంగా 51,000 మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు (Missing) అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వందలాది విపత్తు నిర్వహణ బృందాలు, రెస్క్యూ టీమ్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తూ అత్యాధునిక పరికరాల సహాయంతో కూలిపోయిన కాంక్రీట్ కట్టడాల శిథిలాలను తొలగిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల క్రింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్షీణిస్తుండటంతో బాధితుల కుటుంబాలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరణాల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని, క్షతగాత్రులకు తాత్కాలిక శిబిరాల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక అధికారులు పేర్కొన్నారు.






