ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ లోయలో పడి ఆరుగురు మృతి

by Malleboina Mahesh |

హిమాచల్ ప్రదేశ్‌లోని రాంపూర్‌లో పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ లోయలో పడి ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులను పికప్ చేసుకుని వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి భారీ లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు వివరాల ప్రకారం ఈ విషాదం సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లా రాంపూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వైరల్ వీడియో లో వ్యాన్ అదుపు తప్పి లోయలోకి పడిపోవడం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి లోయలో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతం రహదారులపై మలుపుల వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందవలసి ఉంది.

Next Story