సడెన్ ట్విస్ట్ ఇచ్చిన మహేష్.. అసలు నిజాలు బయటపెడతానంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

వితం చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని, ఎప్పుడు ఎవరి లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఆయన చెప్పారు.

సడెన్ ట్విస్ట్ ఇచ్చిన మహేష్.. అసలు నిజాలు బయటపెడతానంటూ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు, కమెడియన్ మహేష్ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్న ఆయన విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటున్నారు. అయితే ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, మహేష్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న ఆ సెల్ఫీ వీడియోలో మహేష్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. జీవితం చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని, ఎప్పుడు ఎవరి లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఆయన చెప్పారు. బయట కనిపించే విషయాలను బట్టి ఏవేవో ఊహించుకుని నమ్మేయడం అస్సలు కరెక్ట్ కాదని అన్నారు.

ముఖ్యంగా రిపోర్టర్లు, మీమర్స్ అందరూ తాను స్వయంగా వచ్చి అసలు నిజం చెప్పే వరకు ఎలాంటి వార్తలు రాయవద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే తానే స్వయంగా వచ్చి మొత్తం విషయం చెబుతానని మహేష్ స్పష్టం చేశారు. ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉండే మహేష్ ఉన్నట్టుండి ఇంత ఎమోషనల్‌గా కనిపించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఆయనకు ఏమైందో అని కంగారు పడుతూ.. ఏ ఇబ్బంది ఉన్నా తామంతా అండగా ఉంటామంటూ నెటిజన్లు భరోసా ఇస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది నిజంగా జరిగిన విషయమా? లేక ఆయన నటిస్తున్న ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగమా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో.. మహేష్ త్వరలో చెప్పబోయే ఆ నిజం ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story