- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం.. సరికొత్త లుక్‌తో ‘G2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అడివిశేష్
ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

దిశ, సినిమా: వైవిధ్యమైన, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు యంగ్ హీరో అడివి శేష్. ఇటీవల ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కొంత రెస్ట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కష్టపడుతున్నారు. ఆయన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో పాటుగా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు చిత్రబృందం. అంతేకాకుండా పలు అప్డేట్స్ కూడా విడుదల చేసి అంచనాలను పెంచారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.
జూలై నెల నుండి ఈ సినిమా సరికొత్త, భారీ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో పాటు తన కొత్త లుక్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అడివి శేష్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ లుక్‌లో ఎంతో యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఒక పర్‌ఫెక్ట్ స్పై బాడీని తీసుకురావడం కోసం ఆయన జిమ్‌లో గట్టిగానే వర్కవుట్స్ చేస్తున్నారు. అలాగే సినిమాలోని ఇతర నటీనటులతో కలిసి షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ ఫోటోలకు ‘తుఫాను ముందు వచ్చే ప్రశాంతత.. జూలైలో G2 షూటింగ్ మొదలవుతోంది’ అంటూ అడివి శేష్ పెట్టిన క్యాప్షన్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






