- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలిగిపోయిన నిధి..చిన్మయి షాకింగ్ ట్వీట్ వైరల్ !
నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడ్డారు. అయితే బాడీగార్డులు, అభిమానులు అందరినీ వెనక్కి నెట్టి, చివరకు నిధి అగర్వాల్ ను కారు

దిశ, వెబ్ డెస్క్: ది రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు జరిగిన అవమానంపై చిన్మయి స్పందించారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. బుధవారం రోజున ది రాజా సాబ్ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ లాంఛ్ చేశారు. హైదరాబాద్ KPHB సమీపంలో ఉన్న లులూ మాల్ కు ఈ పాట రిలీజ్ లో భాగంగా నిధి అగర్వాల్ వెళ్లారు. ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు నిధి అగర్వాల్. ఈ సందర్భంగా ఆమెను కారు ఎక్కకుండా, సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎగబడ్డారు.
మీద మీద పడిపోయారు. దీంతో నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడ్డారు. అయితే బాడీగార్డులు, అభిమానులు అందరినీ వెనక్కి నెట్టి, చివరకు నిధి అగర్వాల్ ను కారు ఎక్కించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై సింగర్ చిన్మయి స్పందించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ పై అలా మీద పడిపోవడం చాలా దారుణం అంటూ ఫైర్ అయింది. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి మానవ మృగాలను వేరే గ్రహానికి పంపించాల్సిందే అంటూ ఫైర్ అయింది. దీంతో చిన్మయి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. క్లిక్
Read More..
Nidhhi Agerwal: "ది రాజాసాబ్" హీరోయిన్ కు ఘోర అవమానం..ఊపిరాడకుండా చేసి మరీ!
నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్






