నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-18 02:34:46  IST  )

ఏఐ టెక్నాలజీ వల్ల ఎన్నో మార్పులు ఏర్పడుతూ జనాలను ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి.

నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: ఏఐ టెక్నాలజీ వల్ల ఎన్నో మార్పులు ఏర్పడుతూ జనాలను ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతోంది. ఏఐ కారణంగా ఎంతోమంది టాలీవుడ్ హీరోయిన్స్ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీలీల, రష్మిక, కాజల్, కీర్తి సురేష్ వంటి వారు ఏఐ బారిన పడి తమ బోల్డ్ ఫొటోలను వైరల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, మరో హీరోయిన్ నివేదా థామస్ (Nivetha Thomas)ఏఐ బారిన పడినట్లు తెలుపుతూ దుర్వినియోగానికి పాల్పడే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏఐతో అసభ్యకరంగా ఫొటోలను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘ఏఐతో నా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం, సర్క్యులేట్ చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి. వెంటనే నా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించండి. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దు. అనసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దు. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా.. స్టార్ హీరోయిన్లనే కొందరు టార్గెట్ చేస్తుండటం గమనార్హం. కేవలం సెలబ్రిటీలే కాదు.. సాధారణ మహిళలు కూడా ఏఐ దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మంచి కోసం ఉపయోగించాలి తప్ప ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కాదనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇక నివేదా థామస్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టాలీవుడ్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అభిమానులు, నెటిజెన్స్‌లో ఆందోళన మొదలైంది.

link

Read More..

Nidhhi Agerwal: "ది రాజాసాబ్" హీరోయిన్ కు ఘోర అవ‌మానం..ఊపిరాడకుండా చేసి మ‌రీ!

Next Story