- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Buchi Babu: "పెద్ది" రిలీజ్ రోజు నుంచి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది
"పెద్ది" రిలీజ్ రోజు నుంచి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు బుచ్చిబాబు.

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా చేసిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొన్న గురువారం రిలీజ్ అయింది. జూన్ మూడవ తేదీన రాత్రి ప్రీమియర్లు పడిపోయాయి. ప్రీమియర్లు పడ్డ తర్వాత, పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో గురువారం ఉదయం నుంచే థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఇవాళ, రేపు వీకెండ్ కావడంతో పెద్ది కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తొలి రోజు రూ.135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.
సినిమా సక్సెస్ స్టాక్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది ప్రీమియర్లు పడ్డ క్షణం నుంచి ఇప్పటి వరకు తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని వెల్లడించారు. చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తన ఉప్పెన సినిమా కంటే పది రెట్ల విజయాన్ని పెద్ది అందించిందని వెల్లడించారు. దీని అంతటికి రామ్ చరణ్ కష్టం అంటూ ప్రశంసించారు. ఆయనే లేకపోతే, ఇంతటి సక్సెస్ రాకపోయేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






