- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ఘటనపై కొడంగల్‌లో సీఎం రేవంత్ సమరశంఖం!
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా సమరశంఖం పూరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.

దిశ, కొడంగల్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా సమరశంఖం పూరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బుధవారం కొడంగల్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొననున్నారు. హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పర్యటన, అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రే కొడంగల్‌కు చేరుకుని ఇక్కడి తన నివాసంలోనే బస చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు సీఎం చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ధ్వజమెత్తుతూ ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.
కొడంగల్‌లో పటిష్ట బందోబస్తు.. వేడెక్కిన రాజకీయం
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో బస చేయడం, నేడు భారీ నిరసన కార్యక్రమం ఉండటంతో కొడంగల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వేగంగా ఏర్పాట్లు:నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏర్పాట్లలో ముమ్మరంగా నిమగ్నమయ్యారు.
భారీ రద్దీ అంచనా: సీఎం రాకతో కొడంగల్ పట్టణానికి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
సమరానికి సిద్ధం:కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పిలుపునివ్వనున్నారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.






