బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్..లైన్ లో ఆ ఇద్ద‌రు హీరోలు ?

by velandi.Saikiran |

చరణ్ లేటెస్ట్ గా చేసిన పెద్ది సినిమాకు మంచి మార్కులు పడుతున్న నేపథ్యంలో.. దర్శకుడు బుచ్చి బాబుకు డిమాండ్ పెరిగింది.

బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్..లైన్ లో ఆ ఇద్ద‌రు హీరోలు ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దర్శకులలో బుచ్చిబాబు ఒకరు. 2021 సమయంలో ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు. తన తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశారు. కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ లు కూడా ఇండస్ట్రీలో ఈ ఉప్పెన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంచి సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు, అటు లేటెస్ట్ గా రాంచరణ్ తో పెద్ది సినిమా చేశారు. ఈ సినిమా కూడా గురువారం రిలీజ్ కాగా... మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అంటే ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా చేసిన పెద్ది సినిమాకు మంచి మార్కులు పడుతున్న నేపథ్యంలో.. దర్శకుడు బుచ్చి బాబుకు డిమాండ్ పెరిగింది. అతడు నెక్స్ట్ చేసే ప్రాజెక్టుపై అందరూ దృష్టి సారిస్తున్నారు. యంగ్ హీరోలు కూడా అతనితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్ లలో ఒకరితో సినిమా చేసేందుకు బుచ్చిబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారట. ఎన్ని రోజులైనా పర్వాలేదు కానీ.. ఇద్దరిలో ఒకరితో సినిమా చేశాకే ముందుకు వెళ్తానని భీష్మించుకొని కూర్చున్నారట. ఆ ఇద్దరు హీరోల కోసం ఇప్పటికే కథలు కూడా రాసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.

Next Story