PEDDI: మొత్తం రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?.. మొత్తం అక్కడే అయిపోయిందా

by Pulgam srinivas |

'పెద్ది' సినిమా బడ్జెట్‌లో హీరో, దర్శకుడు, నటీనటులు, టెక్నికల్ టీమ్ పారితోషికాలకే దాదాపు రూ.170 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.

PEDDI: మొత్తం రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?.. మొత్తం అక్కడే అయిపోయిందా
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్‌లు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ ఖర్చుల కంటే నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలకే పెద్ద మొత్తంలో ఖర్చవుతోందనే వాదన తరచూ వినిపిస్తోంది. ఇదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా బడ్జెట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించగా, మూవీ బడ్జెట్ సుమారు రూ.350 కోట్లుగా ఉందని చిత్రబృందం పలు సందర్భాల్లో వెల్లడించింది.

అయితే సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు, రూ.350 కోట్ల బడ్జెట్ స్థాయిలో అవుట్‌పుట్ కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో అధిక భాగం రెమ్యూనరేషన్‌లకే వెచ్చించారనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, హీరో, దర్శకుడు, నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు కలిపి సుమారు రూ.170 కోట్లు పారితోషికాల రూపంలో ఖర్చయ్యినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా బడ్జెట్‌లో భారీ శాతం రెమ్యూనరేషన్‌లకే వెళ్లిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Next Story