'మా' ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బాలయ్య మద్దతు ఆ వర్గానికే

by  |
మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బాలయ్య మద్దతు ఆ వర్గానికే
X

దిశ, డైనమిక్ బ్యూరో : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి. నిన్నటి వరకూ నామినేషన్లు, ఉపసంహరణ‌ల వ్యవహారం చర్చకు దారితీస్తే.. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలు ఏ వర్గానికి మద్ధతు తెలుపుతారన్న చర్చ నడుస్తోంది. అనూహ్యంగా.. మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతు ప్రకటించారు. అఖండ సెట్‌లో బాలకృష్ణను కలిసి మంచు విష్ణు మద్దతు కోరగా.. బాలకృష్ణ మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు. కాగా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు.

Next Story

Most Viewed