Breaking: అమరావతి బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకించిన వైసీపీ.. ఎంపీల వాకౌట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 13:09:42  IST  )

అమరావతి చట్ట బద్ధత బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనూ వ్యతిరేకించింది... ఈ మేరకు సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు...

Breaking: అమరావతి బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకించిన వైసీపీ.. ఎంపీల వాకౌట్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్ట బద్ధత బిల్లు(Amaravati Legalization Bill)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) రాజ్యసభ(Rajya Sabha)లోనూ వ్యతిరేకించింది. ఈ మేరకు సభ నుంచి ఆ పార్టీ వాకౌట్ చేసింది. అమరావతి చట్ట బద్ధత బిల్లును లోక్ సభలోనూ వ్యతిరేకించిన ఆ పార్టీ ఎంపీలు పెద్దల సభ్యలోనూ అదే వైఖరిని కొనసాగించారు. అమరావతిని తమ పార్టీ వ్యతిరేకించలేదని, రైతుల భూములు తీసుకుని అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమరావతి చట్ట బద్ధత బిల్లులో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. రాజధానిలో మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవుతుందని కూటమి నాయకులే చెబుతున్నారని, కేవలం రెండేళ్లలోనే 3 లక్షల 40 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇదే మాదిరిగా పాలన కొనసాగితే రాష్ట్రం అప్పు రూ. 14 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అందుకే ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

గర్భిణీని పొత్తి కడుపులో తన్నారు: నాటి అరాచకాలపై రామ్మోహన్ నాయుడు ఎమోషనల్

బీజేపీతో టీడీపీ జాగ్రత్త.. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాట్ కామెంట్స్

Next Story