గర్భిణీని పొత్తి కడుపులో తన్నారు: నాటి అరాచకాలపై రామ్మోహన్ నాయుడు ఎమోషనల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 08:43:23  IST  )

గర్భిణీని పొత్తి కడుపులో తన్నారని, వ్యక్తిత్వ హసనం చేశారని కేంద్రమంత్రి, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ కామెంట్స్ చేశారు...

గర్భిణీని పొత్తి కడుపులో తన్నారు: నాటి అరాచకాలపై రామ్మోహన్ నాయుడు ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: గర్భిణీని పొత్తి కడుపులో తన్నారని, వ్యక్తిత్వ హసనం చేశారని కేంద్రమంత్రి, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు ఐదు సంవత్సరాలు ధర్నాలు, నిరసనలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సంవత్సరాలు పాటు రాజధాని రైతులను అరాచకాలకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్ర రాజధానిలో ఇల్లు కట్టుకున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడ్డారు. ఒక్కోసారి ఒక్కోమాట చెప్పి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా ..

చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా రాజధాని ఉందని, కానీ ఏపీ మాత్రం లేకుండా చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధాని అంటూ ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు సైతం అమరావతి రాజధానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మిస్తున్నామని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే అమరావతి రైతులు రాజధానికి భూములు ఇచ్చారన్నారు. అమరావతి అన్నదాతలకు తాను సెల్యూట్ చెబుతున్నానని రాజ్యసభలో కేంద్రమంత్రి, ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించాు.

రాష్ట్ర విభజన తీరుకు మేం వ్యతిరేకం: రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు

Next Story