- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విభజన తీరుకు మేం వ్యతిరేకం: రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు
ఏపీ పునర్ వ్యవస్థీకరణలో జరిగిన తీరుకు తాము వ్యతిరేకమని ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్ వ్యవస్థీకరణ(AP Reorganization)లో జరిగిన తీరుకు తాము వ్యతిరేకమని ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Legalization Bill)పై రాజ్యసభ(Rajya Sabha)లో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఈ బిల్లు పార్లమెంట్(Parliament)లో ప్రవేశపెట్టడంతో తెలుగు ప్రజలు(Telugu people) గర్విస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చారనేది అందిరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం తన నాయకుడు నేర్పించారని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.
ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో...
ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుపోతుందని తెలిపారు. దసరా రోజున(Dussera) ప్రధాని మోడీ(Pm Modi) అవరావతికి శంకుస్థాపన చేసినట్లు కేంద్రమంత్రి, ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఎంతో ముందుచూపుతో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే కొందరు మాత్రం విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 2019-2024 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు నెలకొన్నాయన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. మూడు రాజధానులంటూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించారని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.






